బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి లాక్‌డౌన్.. మరీ అంత క్లోజ్‌గానా?

by Shyam |   ( Updated:2021-05-13 01:36:37.0  )
Shruthi Haasan
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ లాక్‌డౌన్ లైఫ్‌ను అందంగా మార్చేసుకుంది. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన భామ.. తనతో క్లోజ్‌గా ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఇద్దరూ బ్లాక్ ట్విన్నింగ్ అవుట్‌ఫిట్స్‌లో చీర్‌ఫుల్ సెల్ఫీలు పోస్ట్ చేయగా.. ఈ ఫొటోల్లో పెట్ క్యాట్ క్లారాను మిస్ అయ్యామని ఫీల్ అయిపోయాడు శంతను. శ్రుతి ఫ్రెండ్, హీరోయిన్ తమన్నా భాటియా ‘క్యూటీస్’ అని కామెంట్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అయిన ఈ పోస్ట్‌కు ఇప్పటికే ఐదు లక్షల లైక్స్ వచ్చాయి. కాగా ఈ ఫొటోలు శ్రుతి, సిద్ధార్థ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ పిక్స్‌లాగే ఉన్నాయని చెప్తున్నారు నెటిజన్లు.

కాగా ఈ పోస్ట్ తర్వాత పెట్ క్యాట్ క్లారా గురించి మరో పోస్ట్ పెట్టింది శ్రుతి. క్లారా సూపర్ మోడల్ అని, తనలాగా ఉండటం నేర్చుకోవాలని తెలిపింది. ఇక క్లారా తనను తాను ప్రేమిస్తుంది, నమ్ముతుందన్న భామ.. ఎప్పుడు చిల్ అవ్వాలో, ఏ సమయంలో డ్రాప్ అవ్వాలో తనకు బాగా తెలుసని వివరించింది.

Advertisement

Next Story