శృతి చేసిన తెలుగు వంటకం

by Shyam |
శృతి చేసిన తెలుగు వంటకం
X

శృతిహాసన్ క్వారంటైన్ డైరీస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్, పెట్ క్యాట్ క్లారాతో క్యూట్ మూమెంట్స్, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపరేషన్.. నెటిజన్లకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగువారి స్పెషల్ వంటకాన్ని కూడా టేస్ట్ చేయండి అంటూ తయారు చేసే విధానం చూపించింది శృతి. ఇంతకీ ఈ స్పెషల్ ఏంటో తెలుసా..? మామిడికాయ పప్పు.

https://www.instagram.com/p/CAXUc_Oh7KY/?utm_source=ig_web_copy_link

‘చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్లినప్పుడు మామిడికాయ పప్పు రుచి చూశానని.. అది చాలా నచ్చిందని చెప్పింది శృతి. దీన్ని తయారు చేయడం చాలా సులభమని, మామిడికాయ పప్పులో మామిడికాయ రుచి తెలియాలంటే మాత్రం కొంచెం కారం తక్కువ వేయడమే మంచిదని చెబుతోంది. తనకు కూడా అలాగే ఇష్టమట. అంతేనా ఒక్కసారి ఈ పప్పు టేస్ట్ చేస్తే.. మీరు లైఫ్‌లో అస్సలు మరిచిపోలేరని గ్యారెంటీ కూడా ఇస్తోంది.

Advertisement

Next Story

Most Viewed