Shruti Haasan : నా బాయ్‌ఫ్రెండ్‌ను దేవుడే పంపించాడు

by Shyam |   ( Updated:2021-09-04 07:15:44.0  )
sruthi.jpg
X

దిశ, సినిమా : హీరోయిన్ శ్రుతిహాసన్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్, బోల్డెస్ట్ యాక్టర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన బ్యూటిఫుల్ పిక్చర్స్‌తో పాటు మ్యూజిక్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే కమల్ కూతురు.. అప్పుడప్పుడు బాయ్‌ఫ్రెండ్ హజారికా శంతనుతో క్లోజ్ మూమెంట్స్‌ను కూడా షేర్ చేస్తుంటుంది.

కాగా 2020 తనకు ఏవిధంగా జీవిత పాఠాలు నేర్పిందో లేటెస్ట్ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాలో త్రో బ్యాక్ పిక్‌ పోస్టు చేసిన క్రాక్ బ్యూటీ.. పాండమిక్ టైమ్ తనకు ఫొటోలు ఎలా తీయాలో కూడా నేర్పిందని తెలిపింది. దీంతోపాటు శంతనుతో నైట్‌అవుట్ ఫొటో కూడా షేర్ చేసింది. ఈ పోస్టులో శంతనుకు థ్యాంక్స్ చెప్పిన శ్రుతి.. అతన్ని దేవుడు పంపిన దూతగా పేర్కొంది. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ సేతుపతితో కలిసి నటించిన తమిళ్‌ మూవీ ‘లాభం’ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రం 9వ తేదీన రిలీజ్ కానుండగా, ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్’ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Advertisement

Next Story