- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భాగ్యనగర జ్ఞాపకాల్లో.. శ్రియ
ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి.. తెలుగు, తమిళ్‌లో ఓ వెలుగు వెలిగిన శ్రియ శరణ్.. పెళ్లి చేసుకుని స్పెయిన్‌లో సెటిల్ అయింది. భర్త ఆండ్రూతో కలిసి ప్రస్తుతం అక్కడే లాక్‌డౌన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయినా సరే.. హైదరాబాద్ లైఫ్ స్టైలే సూపర్ అంటోంది. అన్ని విషయాల్లోనూ ‘హైదరాబాద్ ది బెస్ట్’ అంటున్న భామ.. ఈ రంజాన్ మాసంలో భాగ్యనగరాన్ని బాగా మిస్ అయిందట.
పాత బస్తీ, హైదరాబాద్ ఫుడ్ చాలా స్పెషల్ అని.. ఖీర్, డబుల్ కా మీఠా, బిర్యానీ చాలా చాలా మిస్ అవుతున్నట్లు చెప్తోంది. ఒక్కసారి హైదరాబాద్ లైఫ్‌కు అలవాటు పడితే అస్సలు మరిచిపోలేమంటున్న ఈ ఛత్రపతి హీరోయిన్.. ఇక్కడి గాలిలో ఏదో మహిమ ఉందని చెప్పడం విశేషం. ఈ ఏడాది కరోనా కారణంగా రంజాన్ మాసంలో హైదరాబాద్ విజిట్ మిస్ అయినా.. వచ్చే ఏడాది ఫుల్ ఎంజాయ్ చేయాలి అనుకుంటోందట.
ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న శ్రియ తన సోషల్ మీడియా హాండిల్ ద్వారా అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కరోనా కారణంగా దుర్భర స్థితులను ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపిన శ్రియ.. ‘మాస్క్ మస్ట్’ అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.