- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ
దిశ, స్పోర్ట్స్: కాన్పూర్ వేదికగా న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్.. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి టెస్టులోనే ఒక సెంచరీ, మరొక అర్ధ సెంచరీ బాది రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సీనియర్లు విఫలమైన చోటే శ్రేయస్ అయ్యర్ వరుసగా 105, 65 పరుగులు బాదాడు. దీంతో తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో మొదటి సారే 74వ ర్యాంకులో నిలిచాడు. ఇక మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీ నమోదు చేసిన శుభ్‌మన్ గిల్ ఆరు స్థానాలు ఎగబాకి 66వ ర్యాంకుకు, వృద్దిమాన్ సాహ 99వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టాస్ 10 టెస్టు బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా 5, 6 స్థానాలను కాపాడుకున్నారు.
వరుస సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్న శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే నాలుగు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇండియాపై రాణించిన టామ్ లాథమ్ ఏకంగా 5 ర్యాంకులు మెరుగు పరుచుకొని 9వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక అగ్రస్థానంలో జో రూట్, రెండో స్థానంలో స్టీవ్ స్మిత్, మూడో స్థానంలో కేన్ విలియమ్ సన్ ఉన్నారు. బౌలర్లు ర్యాంకుల్లో పాట్ కమిన్స్ అగ్రస్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంకులో కొనసాగుతున్నారు. జస్ప్రిత్ బుమ్రా ఒక స్థానం కోల్పోయి 10వ ర్యాంకుకు చేరుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది మూడు స్థానాలు మెరుగు పరుచుకొని 5వ ర్యాంకుకుచేరుకున్నాడు. న్యూజీలాండ్ పేసర్ కైల్ జేమిసన్ 5 స్థానాలు మెరుగు పరుచుకొని ఏకంగా 9వ ర్యాంకుకు చేరుకున్నాడు.