కాంగ్రెస్‌లో పీక్ స్టేజ్‌కు విభేదాలు.. వారిద్దరి ఫ్లెక్సీలకు ఘోర అవమానం

by Anukaran |   ( Updated:2021-11-08 00:30:44.0  )
కాంగ్రెస్‌లో పీక్ స్టేజ్‌కు విభేదాలు.. వారిద్దరి ఫ్లెక్సీలకు ఘోర అవమానం
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు పిక్ స్టేజ్‌కు చేరుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. తాజాగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీలను చింపేశారు.

అయితే, ఈనెల 9,10 తేదీల్లో కొంపల్లిలో కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు, హోర్డింగులు రోడ్డుపై ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా టీ కాంగ్రెస్ పెద్దలపై కోమటిరెడ్డి, ప్రేమ్ సాగర్ రావు నిరసన గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారిద్దరితో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. ఈ సమయంలోనే ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఫ్లెక్సీలను ఇలా చించేయడంతో పార్టీలో నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed