- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహన చట్టాలకు షోరూంలు తూట్లు
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మోటార్ వెహికిల్ రూల్స్ ప్రకారం వాహన తయారీ కంపెనీలు వాహన కొనుగోలుదారుడికి రెండు నాణ్యమైన హెల్మెట్ ఇవ్వాల్సి ఉంది. కానీ చట్టం వాహనదారులకు తెలియకపోవడంతో కంపెనీలో ఏ ఒక్కరికీ ఇవ్వడం లేదు. కనీసం ఇచ్చే ఒక్క హెల్మెట్‌ను కూడా వాహనదారులకు తామేదో నష్టాలను భరిస్తూ ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాయి. కంపెనీలు ఎక్స్ ట్రా ఫిటింగ్ (యాక్సరీస్)లోనే ఉన్నప్పటికీ వాహన కొనుగోలుదారులకు చూపించడం లేదు. వాహన కొనుగోలు సమయంలో అడిగితేనే వాహన షోరూంలల్లో ఇస్తారు. లేకుంటే ఇక అంతే సంగతులు.
ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో సంబంధిత వాహన తయారీ కంపెనీలు కొనుగోలు దారుడికి హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ప్రతి రోజు రాష్ర్టంలో వేలాది వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికీ రెండు హెల్మెట్‌లు ఇవ్వాలని కేంద్రం చట్టం తీసుకొచ్చింది. అంతేకాదు కేంద్ర మోటార్ వెహికిల్ రూల్స్ 1989 ప్రకారం138(4)(ఎఫ్) కింద వాహన తయారీ కంపెనీలు విధిగా కొనుగోలు దారుడికి హెల్మెట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ రూల్స్ పై ప్రజలకు అవగాహన లేదు. దీంతో వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో సంబంధిత కొనుగోలు దారుడికి కేవలం ఎక్స్ ట్రా ఫిట్టింగ్ పేరుతో రబ్బర్లు, చిన్నచిన్న స్టాండ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు వాహనాల షోరూం యజమానులు. అడిగితే హెల్మెట్ లేకుంటే బండిపై కప్పేందుకు ఒక కవర్ మాత్రమే ఇస్తున్నారు. అదికూడా మీతో మాకు ఉన్న సానిహిత్యమే కారణమని చెబుతూ వాహన కొనుగోలు దారుడిని మభ్యపెడుతున్నారు.ప్రభుత్వం కూడా షోరూంలపై నిఘా పెట్టకపోవడంతో వారు ఆడిందే ఆట… పాడిందే పాటగా తయారైంది. మేము ఇచ్చిందే తీసుకోవాలని కొనుగోలుదారులకు సూచిస్తున్న సందర్బాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేని వారిపై జరిమానాలు విధిస్తున్నారు తప్ప వాహన కొనుగోలు సమయంలో షోరూంలు హెల్మెట్ ఇస్తున్నారా? లేదా? అనే అంశంపై దృష్టి సారించడం లేదు. ద్విచక్ర వాహనదారుడికి హెల్మెట్ లేకుంటే 135 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. దీనికి తోడు వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని లేకుంటే వారికి సైతం జరిమానా విధిస్తేన్నారు. అయితే చట్టాలపై అవగాహన కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కేవలం హెల్మట్ ధరించాలని చెబుతున్నారే తప్ప అందుకు గల కారణాలను మాత్రం విశ్లేషించడం లేదు. ట్రాఫిక్ రూల్స్ పైనే కాకుండా మోటార్ వెహికిల్స్ చట్టంపై కూడా పోలీసులు అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యం చేయాలని పలువురు కోరుతున్నారు.
రోజురోజుకు వాహనాల వినియోగం పెరగడంతో జిల్లా కేంద్రాలకే పరితమైన ద్విచక్ర వాహన షోరూంలు పట్టణ, మండల, మేజర్ గ్రామపంచాయతీల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ మారుమూల గ్రామాల ప్రజలకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో హెల్మెట్ ఇవ్వడం లేదు. దీనికి తోడు వాహన షోరూం యజమానులకూ సైతం కేంద్ర మోటార్ వెహికిల్ రూల్స్ 1989 గురించి తెలియదని పేర్కొంటున్నారు. ఈ చట్టం ప్రకారం138(4)(ఎఫ్) కింద వాహన తయారీ కంపెనీలు రెండు హెల్మెట్ ఇవ్వాలని తెలియదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము కూడా ఈ యాక్టుపై వాహనతయారీ కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని, వారు ఒకే అంటే ఇవ్వడానికి తాము సిద్ధమని తెలిపారు. ఒక వేళా షోరూం యజమానులు విధిగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తే వాహనానికి వేసే రేట్ లోనే దీనిని జతచేసి రేటు పెంచుతామని పేర్కొనడం గమనార్హం. అయితే ఇచ్చే హెల్మెట్లు కూడా బ్యూరోఆఫ్ ఇండియా స్టాండర్స్ నిబంధనల మేరకు ఉండాలని పోలీసులు పేర్కొంటున్నారు. హెల్మెట్లు ఇవ్వక పోతే వినియోగదారుల ఫోరంను గానీ, పోలీసులనుగానీ, ఆర్డీఓ అధికారులను గానీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
అడిగితేనే హెల్మెట్ ఇచ్చారు
హైదరాబాద్‌లోని ఓ షోరూంలో గ్లామర్ బైక్ తీసుకున్న. నాకు కేంద్ర మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం రెండు హెల్మెట్లు ఇస్తారని నాకు తెలియదు. షోరూం వారిని అడిగితే ఎక్స్ ట్రా పిటింగ్ చేస్తున్నామని… కష్టమర్ సేవే మా లక్ష్యమని పేర్కొన్నారు. కానీ హెల్మెట్ అడిగితే అది రాదని రూ.800లు పెట్టి కొనుక్కోవాలని సూచించారు. షోరూం యజమానిని అడిగితే గానీ హెల్మెట్ ఇవ్వలేదు. ప్రభుత్వం, పోలీసులు కేంద్ర మోటార్ వెహికిల్ రూల్స్ 1989 ప్రకారం138(4)(ఎఫ్) పై విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహించాలి.
-అజయ్, వాహనదారుడు, హైదరాబాద్