- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయవాడకి షాక్… మూడు రోజులు కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనతా కర్ఫ్యూను నిర్బంధ కర్ఫ్యూగా మార్చింది. కరోనా కేసు బయటపడడంతో వేగంగా స్పందించిన రాష్ట్ర యంత్రాంగం జనతా కర్ఫ్యూను మూడు రోజుల నిర్బంధ కర్ఫ్యూగా మార్చేసింది.
దీంతో విజయవాడలో 144 సెక్షన్ విధించారు. ఈ 144 సెక్షన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కోవిడ్ లక్షణాలు బయటపడుతున్న నేపథ్యంలో వారితో పాటు వారి కుటుంబం సభ్యులు, బంధువులు, సన్నిహితులు విధిగా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.
ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో విజయవాడలో 144 సెక్షన్ విధించినట్టు ప్రకటించారు. ఈ సెక్షన్ అమలులో ఉన్నన్ని రోజులు ప్రజలు గుంపులుగా ఉండకూడదని, ఒక్కరుగానే పబ్లిక్‌గా సంచరించే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలని గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు.
Tags: ap bundh, vijayawada bundh, 144 section, 144 section in vijayawada, vijayawada, corona virus