- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతికి చుక్కెదురు.. చంద్రబాబుపై పిటీషన్ కొట్టివేత
దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు సోమవారం కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని 2005లో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. 1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు భారీగా ఆస్తులు పెంచుకున్నారని, వాటిపై విచారణ జరపాలని పిటిషన్‌లో లక్ష్మీపార్వతి కోరారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తుల వివరాల ఆధారంగా ఆమె ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్‌పై 2005లో హైకోర్టు స్టే విధించింది. పెండింగ్‌లో ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ కేసులోనూ హైకోర్టు స్టేను ఎత్తివేసింది. స్టే ఎత్తివేసిన అనంతరం మళ్లీ విచారణను కొనసాగించింది. తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ఏసీబీ కోర్టు ప్రకటించింది. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.