బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాలి : శివసేన

by Shamantha N |   ( Updated:2020-12-26 11:40:57.0  )
బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాలి : శివసేన
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి విఫలం అయిందని శివసేన పార్టీ అభిప్రాయపడింది. అంతేగాకుండా కాంగ్రెస్‌ పార్టీ తన నాయకత్వంపైనా, తన సంకీర్ణ కూటమి భవితవ్యంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు చెప్పింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎదుర్కొవాలంటే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాలని శివసేన పార్టీ పిలుపునిచ్చింది. యూపీఏ కూటమి ద్వారా ప్రత్యామ్నాయంగా మారాలని సూచించింది. గత 30 రోజులుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీకి సరైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే తమకు ఎదురులేదని కేంద్రం భావిస్తున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా శివసేనతో సహా ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, అకాలీదళ్‌, బీఎస్పీ, ఎస్పీ, వైఎస్‌ఆర్సీపీ, టీఆర్‌ఎస్‌, బీజేడీ, జేడీఎస్‌ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకమే అని, ఈ పార్టీలన్నీ ఒక వేదికపైకి వస్తే తప్ప కేంద్రంలో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed