- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇమ్యూనిటీ పవర్‌పై శిల్పా బుక్
X
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యమని చెప్తోంది బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటీ శిల్పా శెట్టి. కానీ ఇమ్యూనిటి పవర్ ఎలా పెంపొందించుకోవాలి? దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? అనే విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటామని అంటోంది. కానీ ఇది చాలా సులభమని.. రాకెట్ సైన్స్ అంత కష్టమైన విషయం మాత్రం కాదని చెప్తోంది. మన భారతీయుల ఆహారపు అలవాట్లు, సుగంధ ద్రవ్యాలు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు విలువైన సంపదలు అంటున్న శిల్ప.. వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సలహా ఇస్తోంది. వ్యాయామం కూడా అవసరమే అంటున్న శిల్ప.. ఇందుకోసం భారీ ఎక్విప్‌మెంట్స్, క్లిష్టమైన ఆసనాలెవీ అవసరం లేదని అంటోంది. చాలా సాధారణ ఆసనాలు, వ్యాయామం చేయడం ద్వారా కూడా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందని హామీ ఇస్తోంది.
ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు సలహాలిస్తూ ఒక బుక్ కూడా రాసింది శిల్ప. తన స్నేహితుడు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లుకేతో కలిసి తమ అనుభవాలు జత చేసి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం అందిస్తూ ” ది మ్యాజిక్ ఇమ్యూనిటీ పిల్ – లైఫ్ స్టైల్” ను రూపొందించింది. ఈ పుస్తకాన్ని మీకు కానుకగా ఇస్తున్నామని చెప్పిన శిల్ప.. చక్కగా చదివి ఫాలో అయిపోవాలని చెప్తోంది. ఆన్‌లైన్‌లో ఫ్రీ డిజిటల్ కాపీ అందుబాటులో ఉందని, ఈ పుస్తకం మీ ఆరోగ్యంలో చాలా మార్పులు తీసుకొస్తుందని చెప్పింది.
Advertisement
Next Story