- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పుచేశా.. అయినా పర్లేదు : శిల్పాశెట్టి
దిశ, సినిమా : పోర్నోగ్రఫిక్ కేసులో భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత నటి శిల్పాశెట్టి కఠిన పరిస్థితులను ఎదుర్కొంది. అప్పటి నుంచి లో ప్రొఫైల్‌ను మెయింటైన్ చేసిన శిల్ప.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తరచుగా ఇన్‌స్పిరేషనల్ కోట్స్ షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవడం గురించి తెలిపే వ్యాక్యాలను ఒక బుక్ నుంచి తీసుకుని, వాటిని ఇన్‌స్టాలో పంచుకుంది.
‘చేసిన తప్పులకు జీవితాంతం మూల్యం చెల్లించాల్సిందే – సోఫియా లోరెన్. అక్కడక్కడా కొన్ని తప్పులు చేయకుండా జీవితాలను ఆసక్తికరంగా మార్చలేం. అయితే అవి ప్రమాదకరమైన లేదా ఇతర వ్యక్తులను బాధించే తప్పులు కాకూడదని ఆశించాలి. కానీ మిస్టేక్స్ ఎప్పుడూ ఉంటాయి. మనం చేసిన తప్పులను మర్చిపోవాలనుకునే విషయాలుగా లేదా మనకు ఆసక్తిని కలిగిస్తూ, సవాల్ విసురుతూ మనల్ని ఉత్తేజపరిచే అనుభవాలుగా చూడవచ్చు. చేసిన తప్పుల వల్ల కాకుండా వాటి నుంచి నేర్చుకునే విషయాల వల్ల నేను తప్పులు చేయబోతున్నాను. ఇక్కడ నన్ను నేనే క్షమించుకుని, వాటి నుంచి నేర్చుకుంటాను’ అనే సారాంశం గల యానిమేటెడ్ స్టిక్కర్‌ను యాడ్ చేసింది. చివరగా ‘నేను పొరపాటు చేశాను, కానీ పర్లేదు’ అని ముగించింది.