మృతదేహానికి గుండు గీత…

by Sumithra |
మృతదేహానికి గుండు గీత…
X

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుది. ఖననం చేసిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు గుండు గీసారు. ఈ ఘటన పటాన్‌చెరు మండలం గణపతిగూడెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే… గణపతిగూడానికి చెందిన మల్లమ్మ అనే మహిళ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఈఎస్ఐ ఆస్పత్రిలో మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యలు సంప్రదాయ బద్దంగా ఆమె మృతదేహాన్ని పెట్టెలో పెట్టి ఖననం చేశారు. మూడోరోజు సమాధి వద్దకు వెళ్లి చూడగా.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మృతదేహాన్నివెలికితీసినట్టు గుర్తించారు. అనుమానంతో పెట్టెను తెరిచి చూడగా ఆ మహిళ మృతదేహం గుండుతో కనిపించింది. దీంతో ఆందోళనతో మృతురాలి కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed