- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టార్ కొరియోగ్రాఫర్‌తో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్

దిశ, సినిమా : కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా కెరీర్ మొదటి నుంచి కథకు, కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తున్న వారిలో శర్వానంద్ ఒకరు. ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు సిద్ధపడే శర్వా నటించిన రీసెంట్ ఫిల్మ్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. చివరగా ఉమ్మడి సాగు విధానం కాన్సెప్ట్‌తో వచ్చిన ‘శ్రీకారం’ యావరేజ్‌గా నిలవడంతో అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘మహాసముద్రం’పైనే హోప్స్ పెట్టుకున్నాడు. దీంతో పాటు దర్శకుడు కిషోర్ తిరుమలతో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చేస్తున్న శర్వానంద్.. తర్వాతి చిత్రం ఎవరితో చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరంకు ఆ అవకాశం దక్కినట్లు సమాచారం.
కొరియోగ్రాఫర్‌గా ఫుల్ బిజీగా ఉన్న రాజు సుందరం.. 2008లో ‘ఏగన్’ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు. ప్రస్తుతం వక్కంతం వంశీ కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్న ప్రాజెక్టు ద్వారా పదమూడేళ్ల తర్వాత తిరిగి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. కాగా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వెలువడే చాన్స్ ఉంది.
- Tags
- Choregrapher