- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. యంగ్ హీరోయిన్
దిశ, సినిమా : అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన బాలీవుడ్ భామ శర్వారి వాగ్.. ఇటీవల విడుదలైన ‘బంటీ ఔర్ బబ్లీ 2’ మూవీతో నటిగా పరిచయమైంది. 2005లో రిలీజైన ‘బంటీ ఔర్ బబ్లీ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, రాణి ముఖర్జీ, సైఫ్ అలీఖాన్ వంటి స్టార్ యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. రీసెంట్‌గా తన షూటింగ్ అనుభవాలను మీడియాతో పంచుకున్న శర్వారి.. ఇండస్ట్రీలో తను అమితంగా ఆరాధించే వ్యక్తుల గురించి వెల్లడించింది.
‘రాణి ముఖర్జీ, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్ నా రోల్ మోడల్స్. వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తా. హృతిక్ రోషన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అలాగే ‘హమ్ తుమ్’లో సైఫ్ సర్ చాలా బాగుంటాడు. నన్ను ఇన్‌స్పైర్ చేసినవారిలో వీరందరూ ఉన్నారు. ఇక రాణి, సైఫ్‌తో కలిసి చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. వారు సెట్‌లో పనిచేస్తున్న అందరి పేర్లను గుర్తుపెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయాను’ అని చెప్పుకొచ్చింది.