- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, నేరేళ్లకు చెందిన బాధితులే ఇందుకు సాక్ష్యమని, ఇది ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు, వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరీంనగర్ కమాన్ వద్ద నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుందని కొనియాడారు. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన నేతన్నలు, నారాయణ రెడ్డి, గిద్దె రాములు లాంటి మహనీయులు నడియాడిన గడ్డ కరీంనగర్ అని అన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో కింద ఇవ్వడం జరిగింది.
Next Story