- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల పిలుస్తోంది.. ‘ఆపరేషన్ రాజన్న’ మొదలైంది
దిశ ప్రతినిధి, ఖమ్మం: షర్మిల పార్టీ పేరు ప్రకటించకముందే ‘ఆపరేషన్ రాజన్న’ మొదలు పెట్టారు. ఇప్పటికే పలువురు నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో షర్మిల పార్టీ ముఖ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు ఏకంగా అప్పుడే పార్టీలో చేరుతామంటూ బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. ఇంకొందరేమో షర్మిలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 9న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగకు సుమారు లక్ష మందిని సమీకరించాలని షర్మిల టీం భావిస్తోంది.
వైసీపీలో పనిచేసిన వారిపై దృష్టి..
వైసీపీలో యాక్టివ్‌గా పనిచేసిన నేతలు, కార్యకర్తలపై ముఖ్యంగా ఫోకస్ పెట్టింది షర్మిల టీం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజన్న అభిమానులు, ఎటూ వెళ్లలేక కాంగ్రెస్‌లోనే ఉంటున్న వారిపై మళ్లీ రాజన్న రాజ్యం కోసం పనిచేయాలని పిలుస్తున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే మండల, గ్రామస్థాయిలో గతంలో వైసీపీలో కొనసాగిన వారితో చర్చించారని.. ఏప్రిల్ 9లోపు భారీగా వలసలు ఉంటాయనే చర్చ జోరందుకుంది.
వైఎస్ అభిమానులపై..
వైఎస్ఆర్ అభిమానులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా కొనసాగినప్పుడు కూడా ఈ జిల్లా నుంచి మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. షర్మిల పార్టీ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మధిర వైఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ శీలం విద్యాలత, ఆమె భర్త వెంకటరెడ్డి ఇటీవల షర్మిలను కలిసి మద్దతిస్తున్నట్లు ప్రకటించి, బహిరంగ సభకు పూర్తిగా సహకరిస్తామని మాటిచ్చారు. ఇక సోమవారం పాలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యర్తలు భారీగా షర్మిల పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
సామాజికవర్గాలపై ..
ఓ పక్క ఆయా పార్టీల నుంచి వలసలు ప్రోత్సహిస్తూనే మరోపక్క బలమైన సామాజిక వర్గాలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మూడు సామాజిక వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గమనించిన షర్మిల.. ఆ దిశగా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.