తిరిగి దక్కించుకున్న మార్కెట్.. గంటన్నరలో 2 లక్షల కోట్లు!

by Harish |
తిరిగి దక్కించుకున్న మార్కెట్.. గంటన్నరలో 2 లక్షల కోట్లు!
X

డ్జెట్ ఇచ్చిన షాక్ నుంచి మార్కెట్ మెల్లగా కోలుకుంటొంది. కరోనా వైరస్‌ను అంతర్జాతీయంగా నిలువరించేందుకు చైనా విధించిన ఆంక్షలు ఫలించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లు సానుకూలత చూపిస్తుండంతో మార్కెట్ గత వారాంతంలో నష్టపోయిన దాంట్లో దాదాపు 85% పూడ్చుకుంటోంది. చమురు ధరలు పడిపోవడం వంటి అనుకూల సంకేతాలు సూచీల పరుగులకు కలిసొచ్చాయి. చమురు ధరలు ఏకంగా 14 నెలల కనిష్టానికి దిగాయి. రూపాయి సైతం డాలర్ మారకంతో 13 పైసలు లాభపడింది. సెన్సెక్స్‌లో మదుపరుల సంపద కేవలం గంటన్నరలో రూ. 2 లక్షల కోట్లకు పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత సెన్సెక్స్ 803 పాయింట్లు లాభపడి 40,675 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం భారీగా 235 పాయింట్లు లాభపడి 11,943 వద్ద ట్రేడవుతోంది. రూపాయి డాలర్ మారకంతో రూ. 71.50 వద్ద కొనసాగుతోంది.

ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ 2% పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఆటో, హిందూస్తాన్ యూనిలివర్, భారతీ ఎయిర్‌టెల్, యస్ బ్యాంక్‌ల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed