- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కమల్ హాసన్ వల్లే భారతీయుడు ఆగిపోయింది : శంకర్

దిశ, సినిమా : శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రీకరణ అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇందుకు డైరెక్టర్ శంకర్ కారణమంటూ మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసినన నిర్మాణ సంస్థ.. ఈ ప్రాజెక్టు పూర్తిచేసేవరకు అతడు ఇతర సినిమాలకు పనిచేయకూడదని పిటిషన్‌లో పేర్కొంది.
దీనిపై తాజాగా స్పందించిన శంకర్.. చిత్రీకరణలో జాప్యానికి లైకా ప్రొడక్షన్స్‌తో పాటు కమల్ హాసన్ కూడా కారణమని ఆరోపించాడు. ఇది పూర్తిగా నిర్మాణ సంస్థదే బాధ్యత అని కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాడు. పైగా కమల్ తన క్యారెక్టర్‌కు సంబంధించిన మేకప్ వల్ల ఎలర్జీకి గురవుతున్నాడని, ఈ క్రమంలోనే క్రేన్ యాక్సిడెంట్ జరగడంతో డిలే జరిగిందని తెలిపాడు. ఇక ఫిల్మ్ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో తన వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, అదంతా లాక్‌డౌన్ వల్లనే అని స్పష్టం చేశాడు.
కాగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి కోర్టు ఉత్వర్వు లేదా తీర్పు.. ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక పరిస్థితిని కల్పించలేదని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు.. తమకు తామే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే జూన్ 4వ తేదీన కేసు విచారణకు రానుంది.