- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డు మూసివేత
దిశ, రాజేంద్రనగర్ : భారీ వర్షాలకు గగన్పహాడ్ వద్ద అప్పచెరువు నిండి జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో హైదరాబాద్ నుండి బెంగుళూరు మరియు ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్ళవలసిన రోడ్డును పోలీసులు మూసివేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ & బెంగుళూరు వైపు వెళ్లె వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ గుండా వెళ్ళాలని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండటంతో కట్టకు గండి పడి కార్లు, బస్సులు, లారీలు, జాతీయ రహదారి సైతం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఏడుగురుకు పైగా మృత్యువాత పడ్డారు.
గగన్పహాడ్ వద్ద గల అప్పచెరువు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఆ చెరువు ప్రస్తుతానికి పది ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని.. అందులో ఫ్యాక్టరీలు, గోడౌన్ వెంచర్లు, అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో భారీ వర్షాలకు వచ్చిన వరద నీరు మరోసారి పూర్తిగా నిండి చెరువుకట్టకు గండి పడే పరిస్థితి రావడంతో అధికారులు అప్రమత్తమై చెరువుకు గండి కొట్టి ఆ నీటిని కిందికు వదిలారు. ఈ వరద నీరు జాతీయ రహదారిపై చేరడంతో హైదరాబాద్ వైపు నుండి బెంగళూరు వైపు వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, బెంగుళూరు వైపు వెళ్లాల్సిన వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మళ్లించాలని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అప్పచెరువు కట్టను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్ప చెరువు 45 ఎకరాల్లో ఉండేదని ఈ చెరువులో ఫ్యాక్టరీలు నెలకొల్పడంతో చెరువు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. అధికారులు ఫ్యాక్టరీ నిర్వాహకులతో చర్చలు జరిపి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి కలెక్టర్, ఆర్డీవో, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అధికారుల అప్రమత్తతతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.