డ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు.. విచారిస్తున్న ఎన్‌సీబీ

by Shyam |
డ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు.. విచారిస్తున్న ఎన్‌సీబీ
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారిస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది. రేవ్ పార్టీ సమాచారంతో ముంబై తీరంలోని కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ షిప్‌పై రైడ్ చేసిన ఎన్‌సీబీ.. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కేసులో ఆర్యన్‌ను ప్రశ్నిస్తున్నట్లు ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడ్ వెల్లడించాడు. అయితే అతనిపై ఎటువంటి అభియోగాలు మోపలేదని, అరెస్టు కూడా చేయలేదని తెలిపారు. క్రూయిజ్ పార్టీని ప్లాన్ చేసిన ఆరుగురు నిర్వాహకులు సహా మొత్తం 10 మందిని ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది. కాగా ఈ ఈవెంట్‌ను సూపర్‌వైజ్ చేసిన FTV ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్‌ను కూడా NCB అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఇక ఆర్యన్ ఖాన్ ఫోన్‌ను సీజ్ చేయడంతో పాటు అతని వద్ద ఏవైనా డ్రగ్స్‌ ఉన్నాయా లేదా వినియోగించాడా తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. కాగా క్రూయిజ్ పార్టీలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి వచ్చిన ముగ్గురు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల కుమార్తెలు కావడం విశేషం.

శనివారం రాత్రి పలువురు బాలీవుడ్, ఫ్యాషన్, బిజినెస్ పీపుల్‌తో మూడు రోజుల ‘మ్యూజికల్ వయోగ్’ కోసం క్రూయిజ్‌షిప్ బయలుదేరింది. అయితే నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారనే రహస్య సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ అధికారులు ప్రయాణీకుల వేషంలో షిప్‌లోకి ప్రవేశించగా.. సముద్రం మధ్యలోకి చేరుకున్న తర్వాత రేవ్ పార్టీ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ప్రయానికుల లగేజ్‌లో మాదక ద్రవ్యాలు కనుగొన్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed