- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు.. షారుక్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ 56వ పుట్టినరోజు సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన షారుక్.. తన పెళ్లి, సినిమా ప్రస్థానం గురించి తెలుపుతూ, నేను స్కూల్‌కి వెళ్లే రోజుల నుంచి గౌరీ నాకు తెలుసు. మంచి స్నేహితులుగా ఉన్న మేము పెద్దయ్యాక ప్రేమ అని తెలుసుకున్నాం. అయితే పెళ్లి చేసుకుందాం అనేసరికి అసలు సినిమా మొదలైంది. సినిమాల్లో చూపించినట్లే మా లవ్‌స్టోరీలోనూ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. మా ప్రేమ సంగతి తెలుసుకున్న గౌరీ అన్నయ్య విక్రాంత్ ఓ రోజు ఏకంగా నా చెల్లినే ప్రేమిస్తావా అంటూ గన్ తీసుకొచ్చి నన్ను కాల్చేస్తానని బెదిరించాడు. మా ఇద్దరివి వేర్వేరు మతాలు కావడంతో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది’ అని తెలిపాడు.
అలాగే సినిమా రంగంలో అడుగుపెట్టడానికి ముంబయి వచ్చిన రోజుల్లో చేతిలో పైసాలేక కడుపు మాడ్చుకుని సినిమా ఛాన్స్‌లు వెతికానని తెలిపారు. ఓ సారి అద్దె చెల్లించాలంటే డబ్బులు లేక ఇంటి ఓనరు సామాన్లతో సహా రోడ్డు మీదకు తరిమేస్తే ఓ హోటల్లో వాష్‌రూమ్స్ కూడా శుభ్రం చేశానని చెప్పిన షారుక్.. ఆ కష్టాలే నా జీవితాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయని తెలిపాడు.