- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్, అట్లీ మూవీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
దిశ, వెబ్‌డెస్క్: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ‘అదిరింది, విజిల్’ లాంటి సినిమాల ద్వారా సౌత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అట్లీ.. బాలీవుడ్‌లోనూ తన మ్యాజిక్ చూపేందుకు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అట్లీ.. తన సినిమాల్లో యూజ్ చేసే సక్సెస్ సీక్రెట్‌ను రిపీట్ చేయబోతున్నారు. హీరోను డబుల్, ట్రిపుల్ రోల్‌లో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆయన.. కింగ్ ఖాన్ విషయంలోనూ ఇదే సీక్రెట్‌ను ఫాలో అవబోతున్నారని తెలుస్తోంది.
రెండేళ్లుగా ప్రాజెక్ట్ గురించి చర్చోపచర్చలు జరిగిన తర్వాత.. ఫైనల్‌గా యాక్షన్ ఫిల్మ్ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అందులోనూ తన సక్సెస్ సీక్రెట్‌ను వినియోగించ బోతున్నారు. ఇందులో షారుఖ్.. టాప్ ఇండియన్ ఏజెన్సీకి చెందిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గాను, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాను రెండు పాత్రలు చేయనున్నారని టాక్. కాగా, ఈ డబుల్ డోస్ ఎంటర్‌టైన్మెంట్ అండ్ థ్రిల్లింగ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు ఫ్యాన్స్.
కానీ, షారుఖ్.. ఈ సినిమా కన్నా ముందు మరో రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై జాన్ అబ్రహాం, దీపికా పదుకొనేతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్న షారుఖ్.. తర్వాత రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నారు.