సమంత ‘శాకుంతలం’ రూమర్స్‌పై క్లారిటీ

by Shyam |
సమంత ‘శాకుంతలం’ రూమర్స్‌పై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని కోడలు సమంత లీడ్ రోల్ ప్లే చేస్తోన్న చిత్రం ‘శాకుంతలం’. ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీలో సామ్ ప్రకృతికి ప్రియమైన ‘శకుంతల’ పాత్ర పోషిస్తోంది. సామ్ చేస్తున్న తొలి పురాణ ఇతిహాస చిత్రం ఇదే. మణిశర్మ సంగీతం అందిస్తుండగా..గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. కాగా, డైరెక్టర్ గుణశేఖర్ ముందు హీరో రానా దగ్గుబాటితో ‘హిర‌ణ్య‌క‌శ్య‌ప’ అనే ప్రాజెక్ట్ చేయాల‌ని భావించారు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ వాయిదా ప‌డింది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను..మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్నారు. ఇందులో దుష్యంతుడు పాత్ర ఎవ‌రు న‌టిస్తారు ? అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. దుష్యంతుడుగా రానాతో పాటు ప‌లువురు ప్ర‌ముఖ హీరోల పేర్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో చిత్ర బృందం పుకార్ల‌ని కొట్టి పారేసింది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతున్నదని, ఇలాంటి స‌మ‌యంలో ఇత‌రుల పేర్ల‌ను ప్ర‌చారం చేయొద్దని కోరింది. మీ స‌పోర్ట్‌కి మా ధ‌న్య‌వాదాలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు మూవీ మేకర్స్.

Advertisement

Next Story

Most Viewed