- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూనివర్సిటీలను ప్రారంభించండి : ఎస్ఎఫ్ఐ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను వెంటనే ప్రారంభించాలని ఎస్‌ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ… యూనివర్సిటీలను ప్రారంభించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా యూనివర్సిటీలను ప్రారంభించేందుకు అనుమతులు ఉన్నా.. ఇప్పటికీ విశ్వవిద్యాలయాలను ప్రారంభించక పోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మద్యం షాపుల దుకాణాలు కూడా తెరుచుకున్నాయని, విద్యాసంస్థలను మూసివేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందేమోననే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కరోనాను అవకాశంగా తీసుకుని పేదలు, సామాన్యులను విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రిజిస్టరయిన పరిశోధక విద్యార్థులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఫెలోషిప్‌లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హాస్టల్స్ ఓపెన్ చేయాలని, లేనిపక్షంలో అన్ని యూనివర్సిటీ విద్యార్థులను సంఘాలను సంఘటితం చేసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.