తుఫాన్ ఎఫెక్ట్.. ప‌లు రైళ్లు ర‌ద్దు

by Shamantha N |
తుఫాన్ ఎఫెక్ట్.. ప‌లు రైళ్లు ర‌ద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తౌటే తుఫాన్ కార‌ణంగా గుజరాత్ వెళ్లాల్సిన ప‌లు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (ఎస్‌సీఆర్) అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావంతో గుజ‌రాత్ కోస్తా తీరంలో ఏర్పడిన ప‌రిస్థితుల కారణంగా 6 రైళ్లను రద్దు చేసినట్లు ప్రక‌టించారు. నేడు(16)న న‌డ‌వాల్సిన పూరి-ఓఖా ఎక్స్‌ప్రెస్‌, 17న నడిచే రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌లు, 18న నడిచే పోరుబందర్‌-సికింద్రాబాద్‌, 19న బయలుదేరే ఓఖా-పూరి ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-పోరుబందర్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18న నడ‌వాల్సిన‌ ఓఖా-రామేశ్వరం రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. వివరాలకు www.scr.indianrailways.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed