ఈటలకు మద్దతుగా భారీగా రాజధానికి చేరిన నేతలు

by Shyam |
ఈటలకు మద్దతుగా భారీగా రాజధానికి చేరిన నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ కబ్జా వ్యవహారంతో పతాకశీర్షికలోకెక్కిన మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు రాజధానికి వచ్చారు. శనివారం ఉదయమే వారంతా ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి ఈటల నివాసానాకి చేరుకున్నారు. మంత్రి ఈటలను కలిసేందుకు ఆయన సెగ్మెంట్ హుజురాబాద్ నుంచి మాత్రమే కాకుండా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ముఖ్యంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధికా శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మలా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రమా యాదగిరి నాయక్‌తో పాటు కౌన్సిలర్లు, పార్టీ నేతలు ఈటల నివాసానికి వచ్చారు.

ఈటల వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై ఇంటలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. ప్రతినిత్యం అప్ టూ డేట్ సమాచారాన్ని చేరవేస్తున్నాయి. ఈటలకు మద్దతుగా ఆందోళనకు చేస్తున్న వారి వివరాలు, ఆయన్ను కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వారి వివరాల్ని నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందిస్తున్నాయి. మరోవైపు ఈటల స్వగ్రామం కమలాపూర్ ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 20 ఏండ్ల సుదీర్ఘ రాజకీయంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఈటల తనదైన ముద్ర వేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం మూలంగా ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. దీంతో కమలాపూర్‌లో భారీగా మోహరించిన పోలీసులు, బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed