- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎగిరే దోశ: నీ ట్యాలెంట్ ను ముఖేష్ అంబానీ కూడా కాపీ కొట్టలేడేమో
దిశ,వెబ్‌డెస్క్: దోశ ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ గా మారింది. రోడ్డు పక్కన బండి నుంచి ఫైస్టార్ హోటల్ వరకు దోశల గిరాకీ పెరిగింది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు, పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ దోశ. వేడి వేడి దోశ నోరూరిస్తుంటే.. అల్లం చట్ని, కొబ్బరి చట్ని, సాంబారు నంజుకొని తింటే ఆ టేస్టే వేరప్పా అన్నట్లు ఉంటుంది. ప్లెయిన్ దోశ, మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, ఆమ్లెట్ దోశ, బటర్ దోశ, నెయ్యి మసాలా దోశ, నూడిల్స్ దోశ, కార్న్ దోశ.. ఇలా ఒక్కో దోశది ఒక్కో టేస్టూ. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 120 రకాల దోశలుండగా.. ఎంత ఫేవరేట్ అయినా వీటన్నింటిలో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవడం అప్పుడప్పుడు చాలా కష్టమే అనిపిస్తుంటుంది.
ఇది వరకు అయితే ఇడ్లీలకే ఎక్కువగా డిమాండ్ ఉండేది. ఆయిల్ ఫుడ్ కాదు పైగా త్వరగా జీర్ణమవుతాయి కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేవారు. చిన్నపిల్లలు కూడా ఇడ్లీలను ఇష్టంగా తినడం చూస్తూనే ఉంటాం. ఇక మరో టేస్టీ ఫుడ్ వడలు. చూడగానే నోరూరిపోయే వడల టేస్టే వేరు. అయితే వీటి తయారీకి ఎక్కువ నూనె అవసరం అందుకని డైట్ ఫాలో అయ్యేవారు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండేవారు వడ తినేందుకు ఇంట్రెస్ట్ చూపరు. కానీ ఆయిల్ ఫుడ్ వడ కాకుండా ఇడ్లీలు తింటే త్వరగా ఆకలేస్తుంది. అందుకే ఈ రెండింటికీ ప్రత్యామ్నాయంగా దోశను చూజ్ చేసుకుంటున్నారు ఫుడ్ లవర్స్. అందుకు కారణం దోశలలో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయని, అందుకే ఆరోగ్య రీత్యా మంచిదని సూచిస్తున్నారు ఇండియన్ డయోటిక్ అసోసియేషన్ సభ్యులు. పైగా ఒక్క దోశ తింటే కడుపు నిండిపోతుంది.. టేస్ట్‌కు టేస్ట్.. హెల్తీకి హెల్తీ.. దోశల్ని ఇష్టపడటానికి ఇది ఓ కారణం.
మరి ఇంత ప్రత్యేకమైన దోశను ఓ కుక్ తనదైన స్టైల్లో ఫుడీలకు అందిస్తున్నాడు. సౌత్ ముంబైలోని మంగల్ దాస్ మార్కెట్ లో ‘శ్రీ బాలాజీ దోశ’ పేరుతో ఓ టిఫిన్ సెంటర్ ఉంది. ఆ టిఫిన్ సెంటర్ యజమానికి వ్యాపారంలో రాణించాలంటే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి.. ఎంతటి కష్టాన్నైనా అధిగమించాలి.. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి.. అప్పుడే ఆ వ్యాపారం మూడు ఇడ్లీలు.. ఆరు దోశల్లా మారుతుందని తెలుసుకున్నాడేమో.. అచ్చంగా అదే పని చేస్తున్నాడు. పెనం మీద నుంచి ప్లేట్లోకి దోశను గాల్లో పంపించే స్టైల్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అదే స్టైల్ తో వేడి వేడి దోశలు వేస్తూ గల్లాపెట్టె నింపేసుకుంటున్నాడు.
చూడ్డానికి చిన్న టిఫిన్ సెంటరే కానీ పెనం మీద దోశ గాల్లో నుంచి నేరుగా ప్లేట్లోకి వేసే ఐడియా అదిరిపోవడంతో టిఫిన్ సెంటర్‌కి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఆ వీడియోను 2 లక్షల మంది షేర్ చేయగా 29వేల మంది పాజిటీవ్ గా కామెంట్ చేస్తున్నారు.