నెల్లూరులో తీవ్ర విషాదం.. ఉట్టికర్ర తగిలి చిన్నారి మృతి

by srinivas |
నెల్లూరులో తీవ్ర విషాదం.. ఉట్టికర్ర తగిలి చిన్నారి మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా వినాయక చవితి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. నవరాత్రుల్లో భాగంగా ఉట్టి కొడుతుండగా కర్ర జారి చిన్నారికి తగిలింది. దీంతో బాలుడును గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే శెట్టిగుంటలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అయితే నవరాత్రుల్లో భాగంగా మండపం వద్ద రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి ఉట్టికొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ వేడుకను ఆరేళ్ల శశివర్థన్ తిలకిస్తుండగా ప్రమాదవశాత్తు ఆ కర్ర బాలుడి తలకు తగలడంతో తీవ్రగాయమైంది.

దీంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చెన్నైకి తరలిస్తుండగా గూడూరు పట్టణ సమీపంలోని రాగానే బాలుడి పరిస్థితి విషమించింది. దీంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యసేవలు అందించారు. అయితే సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శశివర్థన్ మృతి చెందారు. దీంతో శెట్టిగుంట గ్రామంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed