బండి సంజయ్‌కు ఘన స్వాగతం..

by Anukaran |   ( Updated:2020-09-07 23:57:48.0  )
బండి సంజయ్‌కు ఘన స్వాగతం..
X

దిశ,వెబ్‌డెస్క్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా, అధికారికంగా జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నాటి చారిత్రక ప్రాంతాల సందర్శనలో భాగంగా యాదాద్రి జిల్లాకు మంగళవారం చేరుకున్నారు. జిల్లాలో అడుగుపెట్టిన బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంజయ్‌కు బోనాలతో ఘన స్వాగతం పలికారు. సంజయ్ రెండ్రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు ఆలేరు మండలంలోని కొలనుపాక, రాజపేట మండలంలోని రేణికుంటను సందర్శించనున్నారు. ఆపై అక్కడి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సంజయ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story