- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభాల జోరులో స్టాక్ మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల జోరును పెంచాయి. గురువారం ఉదయం ప్రారంభంలోనే లాభాలతో మొదలైన తర్వాత బ్యాంకింగ్, ఫార్మా షేర్ల మద్ధతుతో సూచీలు చివరి వరకూ అదే ధోరణి కొనసాగించాయి. గత సెషన్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు గురువారం ఆర్థిక పునరుద్ధరణపై సానుకూల వార్తల నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దలాల్ స్ట్రీట్ లాభాలను సాధించింది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కీలకంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 358.53 పాయింట్లు ఎగసి 52,300 వద్ద ముగియగా, నిఫ్టీ 102.40 పాయింట్లు లాభపడి 15,737 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ మినహాయించి మిగిలిన అన్ని రంగాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా మీడియా ఇండెక్స్ 4 శాతం దూసుకెళ్లగా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ రంగాలు 1-3 శాతం మధ్య బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, డా రెడ్డీస్, టెక్ మహీంద్రా, ఐటీసీ, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు అధిక లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి, హెచ్‌సీఎల్ టెక్, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.08 వద్ద ఉంది.