నిలకడగా మార్కెట్లు!

by Harish |
నిలకడగా మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లకు కరోనా వణుకు తగ్గలేదు. గత వారం కరోనా ధాటికి భారీ నష్టాలను చూసిన తర్వాత, సోమవారం కాస్త తేరుకున్నట్టే కనబడింది. కానీ, మార్కెట్ ముగిసే సమయానికి ఇండియాలో మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని తెలియగానే మళ్లీ నష్టాల్లోకి దిగజారాయి. అయితే, మంగళవారం కాస్త సానుకూలంగా మార్కెట్లు ప్రారంభమవడం గమనార్హం. ప్రస్తుతం సెన్సెక్స్ 290 పాయింట్ల లాభంతో 38,448 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 90.20 పాయింట్లు లాభపడి 11,222 వద్ద ట్రేడవుతోంది. సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags: Sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed