- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నష్టాలతో మొదలైన మార్కెట్లు!
స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ లాభాలను చూసి, గురువారం ప్రారంభంలో మళ్లీ స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి కదులుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్లు ఎప్పుడెలా ఉంటాయో ఊహించలేము. మదుపర్లు ప్రపంచ మార్కెట్లను మరింత నిశితంగా పరిశీలించాలి. అన్ని రంగాల్లో మిశ్రమ ధోరణి ఉన్నందున స్టాక్స్ ఎంపిక, వాణిజ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని మార్కెట్ నిపుణులు అజిత్ మిశ్రా అన్నారు.
ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనిలివర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సూచీలు మార్కెట్ స్వల్పంగా వెనక పడటానికి కారణమయ్యాయి. చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 20.94 పాయింట్ల నష్టంతో 41,302 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ స్వల్ప లాభంతో 0.70 పాయింట్లు లాభపడి 12,126 వద్ద కొనసాగుతోంది. తొలుత ఇండెక్స్ 30 స్టాక్‌లలో 16 నష్టాల్లోనే కదలాడాయి. హిందూస్తాన్ యూనిలీవర్ అత్యధికంగా 1.30 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాలతో కదుల్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లాభాల్లో కొనసాగుతున్నాయి.