- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిదుడుకుల మధ్య లాభాల భాటలో సూచీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గతవారం వరకు రికార్డు లాభాలతో దూసుకెళ్లిన సూచీలు గత రెండు సెషన్లలో లాభాల స్వీకరణ ప్రభావంతో నష్టపోయాయి. గురువారం సైతం నష్టాలతో రోజంతా ఒడిదుడుకుల మధ్య కదలాడాయి. ఉదయం లాభాలతోనే ప్రారంభమైన మార్కెట్లు అనంతరం రియల్టీ, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడంతో నష్టాలను చూశాయి. అయితే, చివర్లో కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ర్యాలీ ఉన్నప్పటికీ దేశీయంగా టెలికాం, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు కీలక మద్దతునిచ్చాయి.
దీంతో మిడ్-సెషన్ అనంతరం స్టాక్ మార్కెట్లు లాభాలవైపు పయనించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 54.81 పాయింట్లు లాభాపడి 58,305 వద్ద క్లోజయింది. నిఫ్టీ 15.75 పాయింట్ల లాభంతో 17,369 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. రియల్టీ ఇండెక్స్ డీలాపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, నెస్లె ఇండియా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను సాధించాయి. టైటాన్, ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రుపాయి మారకం విలువ రూ. 73.53 వద్ద ఉంది.