- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే కరోనా సెకెండ్ వేవ్ ఆందోళనతో బుధవారం భారీ నష్టాలను చూసిన స్టాక్ మార్కెట్లు, గురువారం దేశీయంగా కేసులు పెరుగుదల, దేశవ్యాప్తంగా పలు చోట్ల లాక్‌డౌన్ విధింపులతో మరింత పతనమయ్యాయి. వరుసగా రెండు రోజుల భారీ నష్టాలతో కుదేలవడంతో సెన్సెక్స్ 48,500 దిగువకు, నిఫ్టీ 14,500 మార్కు దిగువకు చేరుకున్నాయి. బుధవారం నాటి నష్టాలకు మెటల్ రంగం షేర్లు ప్రభావితం చేయగా, గురువారం నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి భారీగా కనబడింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 740.19 పాయింట్లు కోల్పోయి 48,440 వద్ద ముగియగా, నిఫ్టీ 224.50 పాయింట్లు నష్టపోయి 14,324 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఇన్‌ఫ్రా, ఐటీ, ఎనర్జీ రంగాలు 2-3 శాతం క్షీణించాయి. సెన్సెక్స్‌లో డా రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, టైటా షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 72.60 వద్ద ఉంది.
Advertisement
Next Story