- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్ నాటికి 61 వేల మార్కును చేరుకోనున్న సెన్సెక్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల నేపథ్యంలో సెన్సెక్స్ 50 వేల మార్కును దాటింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విపరీతంగా ఉన్న సమయంలో మార్కెట్లు ఈ ఏడాది పెద్దగా వృద్ధి సాధించకపోవచ్చని చాలామంది భావిస్తున్నారు. అయితే, ఈ అంచనాలను కాదని, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 61 వేల పాయింట్ల మార్కును అందుకోవచ్చని వెల్లడించింది. గతంలోను మోర్గాన్ స్టాన్లీ 2021 చివరినాటికి సెన్సెక్స్ 55 వేల పాయింట్లను దాటేస్తుందని అభిప్రాయపడింది. తాజా అంచనాలు భారత కంపెనీల ఆర్థిక ఫలితాల్లో సాధిస్తున్న రికార్డుల ఆధారంగా చెబుతున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇప్పుడున్న ధోరణిలోనే సానుకూల పరిస్థితులు కొనసాగితే 61 వేల మార్కును చేరుకోవడం సులభమే అని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. దేశీయ సంస్థల ఆర్థిక ఫలితాల వేగవంతమైన వృద్ధి, సరైన మదింపు ప్రక్రియ(వాల్యూయేషన్), మెరుగైన రీతిలో షేర్ల ర్యాలీ సెన్సెక్స్ ఇప్పుడున్న స్థాయికి 20 శాతం వృద్ధి సాధించడం పెద్ద కష్టం కాదని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా పటిష్టమైన పాలసీ విధానాలు అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్ల కంటే భారత స్టాక్ మార్కెట్లు అధిక లాభాలను సాధించేందుకు కారణాలుగా మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.