లాభాలకు బ్రేక్..స్వల్ప నష్టాల్లో మార్కెట్!

by Harish |
లాభాలకు బ్రేక్..స్వల్ప నష్టాల్లో మార్కెట్!
X

రుసగా నాలుగు రోజులు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్లో నష్టాలు ఏర్పడ్డంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 52 పాయింట్లను కోల్పోయి 41,253 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 12,113 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌టీపీసీ, హీరో మోటో, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్ షేర్లు నష్టాలను చూస్తున్నాయి. అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 71.10 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed