- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం ప్రారంభ సమయంలో చైనాతో సరిహద్దు వివాదం, కరోనా వ్యాప్తి కారణాలతో నష్టాలతో మొదలైన మార్కెట్లు చివరివరకు అదే ధోరణిని కొనసాగించాయి. మిడ్ సెషన్ (Mid session) సమయం తర్వాత నిలదొక్కుకున్న సంకేతాలు కనిపించినప్పటికీ చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్వల్ప లాభాలను పరిమితమయ్యాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 60.05 పాయింట్లు లాభపడి 38,417 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 21.20 పాయింట్ల లాభంతో 11,355 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాలు 1 శాతంలోపే లాభపడ్డాయి. ప్రైవేట్ బ్యాంకులు, రియల్టీ, ఆటో రంగాలు బలహీనపడ్డాయి.
సెన్సెక్స్ ఇండెక్స్ (Sensex Index)లో హిందూస్తాన్ యూనిలీవర్, టీసీఎస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, ఆల్ట్రాసిమెంట్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ షేర్లు దిగజారాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ (Exchange value) రూ. 73.34 వద్ద ఉంది.