- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరిగి లాభాలను దక్కించుకున్న సూచీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను దక్కించుకున్నాయి. సోమవారం నాటి నష్టాలను అధిగమిస్తూ సూచీలు బౌన్స్ బ్యాక్ అయ్యాయి. ఉదయం ప్రారంభం తర్వాత మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ మిడ్ సెషన్ తర్వాత ఊపందుకున్నాయి. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు పతనం కావడంతో ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లలో మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారని, ఆ తర్వాత పరిణామాల మార్పుతో సూచీలు చివరి గంటలో లాభాలను దక్కించుకున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 376.60 పాయింట్లు ఎగసి 40,522 వద్ద ముగియగా, నిఫ్టీ 121.65 పాయింట్లు లాభపడి 11,889 వద్ద ముగిసింది.
నిఫ్టీలో ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు 3 శాతానికిపైగా పుంజుకోగా, మీడియా, ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాఉ 1 శాతానికిపైగా బలపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, రియల్టీ రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అత్యధికంగా కోటక్ బ్యాంక్ 12 శాతానికి పైగా జంప్ చేయగా, నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, ఆల్ట్రా సిమెంట్, మారుతీ సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, టీసీఎస్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రొ. 73.66 వద్ద ఉంది.