- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా సోమవారం భారీ నష్టాలను చూసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. భారీ పతనం అనంతరం జీడీపీ గణాంకాలు ఊహించిన స్థాయిలోనే ఉండటంతో ఇన్వెస్టర్లపై ప్రభావం కనిపించలేదు. దీనికితోడు అనేక రంగాల్లో కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటూ ఉండటంతో రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి మెరుగవుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
ఈ పరిణామాలతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 272.51 పాయింట్లు లాభపడి 38,900 వద్ద ముగియగా, నిఫ్టీ 82.75 పాయింట్లు ఎగసి 11,470 వద్ద ఉంది. ముఖ్యంగా టెలికాం రంగ షేర్ల మద్దతుతో మార్కెట్లు పుంజుకున్నాయి. నిఫ్టీలో మెటల్ (metal), ఎఫ్ఎంసీజీ (FMCG), ఫార్మా (Pharma), రియల్టీ (Realty), మీడియా (Media), ఆటొ రంగాలు (auto sectors) లాభాలను నమోదు చేశాయి.
ఐటీ రంగం మాత్రమే నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel), బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance), ఏషియన్ పెయింట్స్ (Asian Paints), టాటా స్టీల్ (Tata Steel), ఎన్‌టీపీసీ (NTPC), ఎస్‌బీఐ (SBI), బజాజ్ ఫిన్‌సర్వ్ (Bajaj Finserv), హిందూస్తాన్ యూనిలీవర్ (Hindustan Unilever), టైటాన్ (Titan), కోటక్ బ్యాంక్ (Kotak Bank), నెస్లె ఇండియా (Nestle India), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), మారుతీ సుజుకి (Maruti Suzuki), ఎల్అండ్‌టీ (L&T) షేర్లు లాభాల్లో కదలాడగా, ఓఎన్‌జీసీ (ONGC), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), టెక్‌మహీంద్రా (Tech Mahindra), ఇన్ఫోసిస్ (Infosys) షేర్లు నష్టపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.86 వద్ద ఉంది.