సీనియర్ న్యాయవాది రామచంద్రరావు ఇకలేరు..

by Shyam |
సీనియర్ న్యాయవాది రామచంద్రరావు ఇకలేరు..
X

దిశ, న్యూస్‌బ్యూరో: సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన ఆయన ప్రభుత్వ సర్వీస్ విషయాల్లో, రాజ్యాంగ సంబంధమైన విషయాల్లో న్యాయ కొవిదుడుగా పేరొందాడు. ఆయన వాదించిన కేసుల్లో మెజార్జీ సర్వీస్ మేటర్‌కు సంబంధించినవే ఉన్నాయి. ఉమ్మడి ఏపీ న్యాయవాదిగా ఉన్న రామచంద్రరావు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన కేసు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 అభ్యర్థుల కేసును వాదించారు.

ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో పనిచేస్తున్న న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కూడా విద్యుత్ ఉద్యోగుల కేసులో ఆయనతో పాటు కలిసి వాదించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక సర్వీస్ మేటర్ కేసుల్లో రామచంద్రరావు కృషి ఉన్నదని, ఈ అంశంలో ఆయన ఒక లెజెండ్ అని ప్రభాకర్ పేర్కొన్నారు. శాసనసభ్యుల అనర్హత, రాజ్యాంగ విధులు, శాసన వ్యవహారాల అంశాలో తలెత్తే సంక్షోభం, తదితర పలు అంశాల్లో ఎప్పటికప్పుడు స్పందించే రామచంద్రరావు కృషిని రెండు తెలుగురాష్ట్రాల హైకోర్టు న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed