- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
దిశ, క్రైమ్‌బ్యూరో: డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన అధికారులు కార్గో బస్సులో ఉన్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 250కిలోల ఎపిడ్రిన్, కెటమైన్, మేపిడ్రిన్‌ను సీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో మత్తు మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు… డ్రగ్స్ విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు మరో రూ.50కోట్ల విలువ చేసే రా మెటిరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం నగరంలో దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 110కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విశాఖలో రూ.70వేలకు 100 కిలోల గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి వేచి చూస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆశిష్‌సింగ్, సుమిత్ మకాడియా, రామావత్ మోతిలాల్, రామావత్, విజయ్, రాజ్ కుమార్ సింగ్‌లను అదుపులోకి తీసుకొని షిప్ట్ కారు, 7సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.