రెండో విడత రైతు భరోసా విడుదల

by srinivas |   ( Updated:2020-10-27 01:39:26.0  )
రెండో విడత రైతు భరోసా విడుదల
X

దిశ, వెబ్‎డెస్క్ : ఏపీలో రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా రైతులకు వరుసగా రెండో ఏడాది రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. రాష్ట్రంలో 50.47 లక్షల మంది రైతుల కుటుంబాల ఖాతాల్లో మొత్తం రూ.1,115 కోట్ల సాయం అందించారు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500 సాయం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. గిరిజన రైతులకు రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

దీంతో లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు మూడు దఫాలుగా సాయం అందిస్తున్నామని తెలిపారు. పంట నష్టపోయిన 1.66 లక్షల మందికి రూ.135.73 కోట్ల సాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. అక్టోబర్‎లో నష్టపోయిన రైతులకు నవంబర్‎లోనే పరిహారం చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed