- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ మారియో గేమ్‌కు ఇంకా తగ్గని క్రేజ్.. ఫ్రూఫ్ ఇదే..!
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా మొబైల్, పీసీ, ల్యాపీల్లో గేమ్స్ ఆడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గేమర్స్ కోసమే ప్రత్యేక పీసీలు, ఫొన్లు మార్కెట్‌లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోజుకో కొత్త గేమ్ పుట్టుకొస్తుంది. ఇక ఇందులో వార్, బాటిల్ గేమ్స్ మరింత ఆదరణ పొందాయి. అయితే క్యాండీక్రష్, యాంగ్రీ బర్డ్, టెంపుల్ రన్, కాంట్రా, లూడో, పోకేమాన్, పబ్‌జీ, ఫౌజీ వంటి ఆటలు నేటితరంలో బాగా ప్రాచుర్యం పొందగా, నైంటీస్ జనరేషన్ ఫేవరేట్ గేమింగ్ లిస్ట్‌లో ‘సూపర్ మారియో’ టాప్ ప్రయారిటీ అందుకుంటుంది. జపనీస్ ఫేమస్ వీడియో గేమ్ సంస్థ నింటెండోకు చెందిన ఈ గేమ్ వరల్డ్‌వైడ్ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన అన్‌ఓపెన్డ్ సూపర్ మారియో గేమ్ కాపీ ఒకటి తాజాగా రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయి, గేమింగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన గేమ్‌గా నిలిచింది.
చరిత్రకు సంబంధించిన గొప్ప కళాఖండాలు అత్యధిక ధరకు అమ్ముడుపోవడం చిత్రమేమి కాదు. కానీ సూపర్ మారియో గేమ్ కాపీ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం మాత్రం అరుదైన విషయమే. 1987లో విడుదలైన సూపర్ మారియో 64 కాపీని డల్లాస్‌లోని హెరిటేజ్ ఆక్షన్ హౌజ్(డల్లాస్) ఆదివారం వేలం వేసింది. కంప్లీట్‌గా సీల్ చేసిన కాపీ కావడంతో పాటు, కాట్రిడ్జ్ బాక్స్‌పై కంపెనీ సీల్, చిత్రాలు కూడా చెక్కుచెదరకుండా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో గేమ్‌లకు గ్రేడింగ్, సర్టిఫికేట్ అందించే ప్రముఖ కంపెనీ వాటా స్కేల్ ఈ సూపర్ మారియో కాపీకి 9.8రేట్ ఇవ్వడంతో దీని విలువ మార్కెట్లో మరింత పెరిగింది. ప్లాస్టిక్ సీల్ కూడా A ++ ను సాధించింది, ఇది సాధ్యమైనంత ఎక్కువ రేటింగ్. దాంతో పాటు ప్రపంచంలో ఉనికిలో ఉన్న ఐదు కన్నా తక్కువ కాపీలలో ఇది ఒకటని హెరిటేజ్ తెలిపింది. ఎన్నో పాజిటివ్ అంశాలుండటంతో సూపర్ మారియో 64 కాపీ 1.56 మిలియన్లకు (సుమారు రూ. 11.6 కోట్లు) వేలంలో అమ్మడుపోయి గత రికార్డులు బ్రేక్ చేసింది. అదే సమయంలో మిలియన్ ధర దాటిన మొట్టమొదటి ఆటగా నిలిచింది.
ఏప్రిల్‌లోనే అన్ ఓపెన్డ్ సూపర్ మారియో కాపీ 660వేల డాలర్ల (రూ. 4.84 కోట్లు)కు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించగా, దాన్ని బ్రేక్ చేస్తూ ‘ద లెజెండ్ ఆఫ్ జెల్దా’ గేమ్ అత్యధికంగా 6.48 కోట్లకు ఇటీవలే అమ్ముడుపోయింది. 48 గంటలు గడిచేలోపే మళ్లీ ఆ రికార్డ్‌ను సూపర్ మారియో 64(రూ. 11.6కోట్లు) బ్రేక్ చేయడం విశేషం.