- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలప ఉత్పత్తుల నుంచి అత్యుత్తమ బయోప్లాస్టిక్
దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ ఉత్పత్తులు పర్యావరణానికి ఎంతటి విఘాతం కలిగిస్తున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెట్రోలియం తదితర ఇంధనాలు, శిలాజాల నుంచి రూపొందించబడిన ప్లాస్టిక్ వినియోగం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయని పర్యావరణ వేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో పలు సంస్థలు, శాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం కనుగొనేందుకు ప్రయత్నిస్తుండగా.. తాజాగా యూఎస్ శాస్త్రవేత్తలు ఉడ్ ప్రొడక్ట్స్ (కలప ఉత్పత్తుల) నుంచి అత్యుత్తమమైన ఎకో ఫ్రెండ్లీ బయోప్లాస్టిక్‌ను రూపొందించారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్.. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఇన్నోవేషన్ ప్రొఫెసర్ లియాంగ్‌బింగ్ ఈ బయోప్లాస్టిక్‌ను తన అధ్యయనంలో కనుగొన్నారు. ఈ స్టడీ వివరాలు నేచర్ సస్టెయినెబిలిటీ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. ఈ స్టడీలో ప్రొఫెసర్ లియాంగ్ బింగ్‌తో యేల్ స్కూల్ ఆఫ్ ది ఎన్విరాన్‌మెంట్ ప్రొఫెసర్ యువాన్ యో కూడా పాల్గొన్నారు. బయోప్లాస్టిక్ తయారీ కోసం వీరు ఉడ్(కలప) ప్రొడక్ట్స్‌ను ద్రవ రూపంలోకి మార్చి, ఆ తర్వాత బయోప్లాస్టిక్‌గా రూపొందించారు. కాగా ఈ ప్లాస్టిక్ ఈజీగా బయోడీగ్రేడ్ అవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్లాస్టిక్ తయారీకి కావాల్సిన కలప కోసం ఫారెస్ట్ సిమ్యులేషన్స్ మోడల్స్ ఉండాలని, అందుకు స్టడీ చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధన కోసం తాము కొన్ని కలప ఉప ఉత్పత్తులను మ్యానుఫాక్చరింగ్ సెంటర్ల నుంచి సేకరించామని, అయితే బల్క్ ప్రొడక్షన్ చేయడానికి మాత్రం అవి సరిపోవని వెల్లడించారు.