- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూగినియాలో ‘చాక్లెట్ ఫ్రాగ్స్’ను గుర్తించిన శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్: న్యూగినియాలోని లోతట్టు వర్షారణ్య ప్రాంతంలో ఆసక్తికరమైన ‘చాక్లెట్ కప్ప’ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ ట్రీ ఫ్రాగ్స్ సాధారణంగా ఆకుపచ్చ చర్మాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇవి మాత్రం గోధుమ రంగులో ఉన్నాయి. ఆ కారణంగానే వీటిని పరిశోధకులు చాక్లెట్ ఫ్రాగ్స్‌గా అభివర్ణిస్తూ.. ఆస్ట్రేలియన్ లిటోరియా జాతికి చెందిన ఈ ట్రీ ఫ్రాగ్స్‌కు ‘మిరా’ అని పేరు పెట్టారు. లాటిన్ పదమైన ‘మిరుమ్’ నుంచి ప్రేరణ పొంది వీటికి ఆ పేరు పెట్టారు. ‘మిరుమ్’ అంటే ఆశ్చర్యం లేదా వింత అని అర్థం.
హ్యారీ పాటర్ మాంత్రిక ప్రపంచంలో ప్రసిద్ది చెందిన మాయ స్వీట్ల మాదిరిగానే శాస్త్రవేత్తలకు ‘చాక్లెట్ ఫ్రాగ్స్’ కనిపించాయి. అయితే ఇవి ‘ఆస్ట్రేలియన్ గ్రీన్ ట్రీ ఫ్రాగ్’(లిటోరియా సెరులియన్)ను పోలి ఉన్నాయి. అయితే ఈ రెండు కప్పలు ఓకేలా కనిపించినా, రంగుతో పాటు, వాటి లక్షణాల్లోనూ స్వల్ప తేడాలున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ రెండు కప్పల మధ్య పోలిక ఉండటానికి కారణం 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా, న్యూగినియాలు భూమితో అనుసంధానించబడి ఉండటంతో పాటు, అనేక జీవసంబంధమైన అంశాలను పంచుకోవడమే అందుకు కారణమని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ప్రస్తుతం న్యూగినియా ద్వీపం.. క్వీన్స్‌లాండ్ నుంచి టోర్రెస్ జలసంధి ద్వారా వేరు చేయబడింది.
అయితే న్యూగినియా వర్షారణ్య ప్రాంతం కాగా, ఉత్తర ఆస్ట్రేలియా సవన్నా ప్రాంతమని ఈ రెండు ప్రాంతాల మధ్య జీవసంబంధమైన మార్పిడిని పరిష్కరించడం అవసరమని వారు పేర్కొన్నారు. ఇక ఈ కప్పను కనుగొన్న ప్రదేశం ప్రపంచంలోనే మోస్ట్ అన్‌ప్లీజెంట్ ప్లేస్ కాగా, ఎక్స్‌ప్లోరేషన్‌కు ఇది అనుకూలించని భూభాగంగా పరిశోధకులు తెలిపారు. ఇక్కడ చాలా వేడితో పాటు, అనేక మొసళ్లు, దోమలు ఉంటాయని, ఇలాంటి చిత్తడి ప్రాంతంలో పరిశోధనలు సాగించడం చాలా కష్టతరమని జన్యు విశ్లేషణ చేసిన క్వీన్స్‌లాండ్ మ్యూజియం గ్రిఫిత్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పాల్ ఆలివర్ అన్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన విశేషాలు మే 20న ఆస్ట్రేలియన్ జర్నల్ ఆఫ్ జువాలజీలో ప్రచురితమయ్యాయి.