- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో స్కూల్స్ రీఓపెన్.. డేట్ ఫిక్స్ చేసిన జగన్
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరిచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈలోగా నాడు-నేడులో భాగంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి విడత నాడు-నేడులో పూర్తయిన పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించినరోజే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. అలాగే కొత్త విద్యావిధానం అమలులోకి రానున్న నేపథ్యంలో.. ఈ విద్యావిధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా విశ్లేషణ చేయాలన్నారు. అలాగే పాఠశాలలు తిరిగి ప్రారంభించిన నాడే విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా అందజేయాలన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.