Panasonic నుంచి స్కాలర్‌షిప్ పోగ్రాం 2022-23

by Harish |
Panasonic నుంచి స్కాలర్‌షిప్ పోగ్రాం 2022-23
X

స్కాలర్షిప్: అల్పాదాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తగిన ఆర్థిక సహాయాన్ని పానాసోనిక్ అందిస్తోంది. ఐఐటి విద్యార్థులకు వారి ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ స్కాలర్షిప్‌ ఇస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:

ఇండియాలోని ఏదైనా ఐఐటిలో బీఈ/బీటెక్ కోర్సు చదువుతున్న విద్యార్థులు అర్హులు.

12వ తరగతి పూర్తయిన లేదా ఫలితాల కోసం వేచి చూస్తున్న వారు అర్హులు.

12వ తరగతిలో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి.

భారతీయ విద్యార్థులు అర్హులు.

2022-23 బ్యాచ్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

నోట్: ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న ఫీజు రిసిప్ట్ కలిగి ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం: ఏడాదికి రూ. 42,500 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు.

కావలసిన పత్రాలు:

12వ తరగతి మార్క్ షీట్ (2021-22)

గుర్తింపు కార్డు (ఓటర్ ఐడి/ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్)

అడ్మిషన్ లెటర్

ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రిసిప్ట్.

బ్యాంక్ అకౌంట్ వివరాలు.

ఇన్ కమ్ సర్టిఫికెట్ (ఐటిఆర్ ఫార్మ్ 16/ఇన్‌కమ్ సర్టిఫికెట్/సాలరీ స్లిప్)

విద్యార్థి ఫొటో

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 11, 2022.

వెబ్‌సైట్: https://www.buddy4study.com

Advertisement

Next Story