జన్‌ధన్ ఖాతాదారులకు ఇంకా రూ. 164 కోట్లు బాకీ ఉన్న ఎస్‌బీఐ!

by Harish |
SBI
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వం రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ 2017, ఏప్రిల్ నుంచి 2019, డిసెంబర్ మధ్య డిజిటల్ చెల్లింపుల కోసం ప్రోత్సహించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ఖాతాల నుంచి వసూలు చేసిన రుసుమును రీఫండ్ చేయలేదని ఓ నివేదిక తెలిపింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ-ముంబై) రూపొందించ ఈ నివేదికలో పీఎంజేడీవై ఖాతాదారుల నుంచి యూపీఐ, రూపే లావాదేవీలకు రుసుముగా ఎస్‌బీఐ రూ. 254 కోట్లను పొరపాటున వసూలు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం వసూలు చేసిన రుసుమును తిరిగి చెల్లించమని బ్యాంకుకు ఆదేశాలిచ్చింది. అయితే, ఇప్పటివరకు ఆ మొత్తంలో కేవలం రూ. 90 కోట్లను మాత్రమే వెనక్కి ఇచ్చిందని నివేదిక పేర్కొంది. మిగిలిన రూ. 164 కోట్లను ఇంకా ఇవ్వలేదని స్పష్టం చేసింది.

2017, జూన్ 1 నుంచి ఎస్‌బీఐ ఇతర బ్యాంకుల మాదిరి కాకుండా నెలకు నాలుగు లావాదేవీలు పూర్తయిన పీఎంజేడీవై ఖాతాలు మొత్తం 14 కోట్ల యూపీఐ, రూపే లావాదేవీలకు ఒక్కోదానిపై రూ. 17.70 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాతి పరిణామాలతో ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా 2021, ఫిబ్రవరి నుంచి ఎస్‌బీఐ ఖాతాదారులకు రీఫండ్ ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పటివరకు రూ. 90 కోట్లు తిరిగివ్వగా, ఇంకా రూ. 164 కోట్లను ఇవ్వాల్సి ఉందని నివేదిక రూపొందించిన స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ ఆశిష్ దాస్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed