- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇది శ్రీలంక క్రికెట్ జట్టుకు అత్యంత బాధకరమైన రోజు’
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక క్రికెట్‌లో ముసలం ఏర్పడింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆ జట్టు వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతుండటంలో విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ అపజయాలకు కారణాలపై మాజీ క్రికెటర్లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. శ్రీలంక క్రికెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే మరింత దిగజారి పోతుందని మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక వరుసగా మూడు టీ20 మ్యాచ్‌లు ఓడిపోయింది. చివరి టీ20లో 91 పరుగులకే ఆలౌట్ అవడంతో ఆ జట్టు అభిమానులే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ‘ఇది శ్రీలంక క్రికెట్ జట్టుకు అత్యంత బాధకరమైన రోజు. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. వెంటనే జట్టును రక్షించే చర్యలు తీసుకోవాలి’ అని జయసూర్య ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్‌కు చాలా మంది మద్దతు పలుకుతున్నారు. రాబోయే టీమ్ ఇండియా పర్యటనలో జట్టు మంచి ప్రదర్శన చేసేలా సన్నద్దం చేయాలని సలహాలు ఇస్తున్నారు.